కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి

Take these precautions to avoid getting kidney problems

0
75
3d render of Human kidney with DNA

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి మనం తినే ఆహారం సరైనది అయితే కిడ్నీలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో మన దేశంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ కిడ్నీ సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఉంది అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ కిడ్నీ సమస్యలు అనేవి రావు అంటున్నారు నిపుణులు.

రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి. దీని వల్ల కిడ్నీ సమస్యలు దూరం అవుతాయి. క్యాప్సికంలో ఉండే విటమిన్ ఎ, సీ, పోటాషియం కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అందుకే దీనిని తరచూ తీసుకుంటే మంచిది. వారానికి ఓ సారి ఈ క్యాప్సికం తీసుకుంటే ఎంతో మంచిది. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వెల్లులి రోజూ ఏదో ఓ రూపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఫైబర్, విటమిన్లు పీచు పదార్దాలు లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉల్లిపాయలు, పైనాపిల్స్ , ఓట్స్ కూడా చాలా మంచిది. కొందరు మూత్రం వస్తే ఆపుకుంటారు ఇలా చేయవద్దు దీని వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.