తలైవి చిత్రంలో శశికళ పాత్ర ఫిక్స్

తలైవి చిత్రంలో శశికళ పాత్ర ఫిక్స్

0
107
Thalaivi First Look

తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌ తలైవి చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఇందులో
కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో చేస్తున్నారు.. ఇప్పటికే అమ్మ స్టిల్స్ బయటకు వచ్చాయి.
మరి జయలలిత అంటే క చ్చితంగా ఆమె స్నేహితురాలు శశికళ పక్కన ఉంటారు .మరి ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర ఉండాల్సిందే, మరి ఈ పాత్ర ఎవరు చేస్తున్నారు అని అందరూ ఆలోచిస్తున్నారు.

తాజాగా కోలీవుడ్ వార్తల ప్రకారం జయలలిత సన్నిహితురాలు శశికళ పాత్రలో ప్రముఖ నటి ప్రియమణి కనిపించనున్నట్టు తెలుస్తోంది, జయలలిత అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో మూడు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇప్పటికే ప్రియమణితో ఈ సినిమా గురించి చర్చించారట. ఆమె కూడా చేయడానికి సమ్మతం తెలిపారు అని వార్తలు వస్తున్నాయి ..తెలుగు తమిళ హిందీ భాషల్లో తలైవి సినిమా తెరకెక్కుతోంది. ప్రియమణి ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్స్‌ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో బిజీగా ఉంది. వచ్చే వారం నుంచి ఆమెకు సంబంధించి చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారట.