కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తున్న తమన్నా ఐటెం సాంగ్ – వీడియో వైరల్

0
105

మెగా హీరో వరుణ్ తేజ్ తాజా మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏప్రిల్‌ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా నుండి ఐటెం సాంగ్‌ ను కాసేపటి క్రితమే వదిలింది చిత్ర బృందం. “కొడ్తే” అంటూ సాగే ఈ ఐటెం సాంగ్‌ లో హీరోయిన్‌ తమన్నా నటించింది. ఈ సాంగ్‌ ఆధ్యాంతం.. తమన్నా చుట్టే తిరుగుతుంది. అలాగే.. తన హాట్‌ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెకించింది తమన్నా.

అల్లు అరవింద్ సమర్పణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌ శెట్టి, జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు.  ఇప్పటికే వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ గా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించారు. ఇక గని సినిమాతో మరో హిట్ కొట్టాలని వరుణ్ కసిగా కనిపిస్తున్నాడు.

 

ఐటెం సాంగ్‌ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://youtu.be/Q8KHZg__1vA