తప్పుడు వార్తలపై స్పందించి బాధపడిన తమన్నా

-

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamanna) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో నటించి సత్తా చాటింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. అయితే, తాజాగా.. నెక్ట్స్‌ నటించబోయే సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ-అనిల్​ రావిపూడి సినిమాలో తమన్నా(Tamanna)తో ఓ ఐటెం సాంగ్​ చేయనుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు ఇందుకోసం కోటిన్నర డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా తమన్నా స్పందించింది. ఇందులో భాగంగా ఆమె.. తనకు బాలయ్య సర్, అనిల్ రావిపూడి(Anil Ravipudi)పై ఎంతో గౌరవం ఉందని తెలిపింది. వారి సినిమా కోసం తనను ఒప్పించాల్సిన అవసరం లేదని, ఆ టీంలో పనిచేయడాన్ని తానెంతో ఎంజాయ్​ చేస్తానని తెలిపింది. అయితే, తాను ఐటెం సాంగ్​ చేస్తున్నట్టుగా తప్పుడు వార్తలు రాయడం తనను బాధించిందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...