బోల్డ్ సీన్స్ ఎఫెక్ట్.. భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన తమన్నా!!

-

హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లపాటు తెలుగు తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది తమన్నా. గ్లామర్ రోల్స్ పోషిస్తున్నప్పటికీ.. లిప్ లాక్ సీన్లకు మాత్రం అభ్యంతరం తెలిపేది వైట్ బ్యూటీ. అయితే సౌత్ లో ఆఫర్స్ తగ్గిన వెంటనే బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది. ఇటీవల తాను నటించిన జీ కర్దా లో ఘాటు రొమాన్స్ సీన్లలో నటించి ఘాటు విమర్శలు అందుకుంటోంది.

- Advertisement -

అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ -2 లో కూడా మితిమీరిన బోల్డ్ సీన్స్ లో నటించి మరిన్ని విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ఈ విమర్శలపై తమన్న కూడా అంతే ఘాటుగా స్పందిస్తోంది. ఇదిలా ఉండగా తమన్న గురించిన మరో హార్ట్ టాపిక్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తిరిగి ఫామ్ లోకి వచ్చిన తమన్నా తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందట. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3-4 కోట్లు తీసుకునే ఆమె.. లస్ట్ స్టోరీస్ కోసం రూ.6 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె భోళా శంకర్ లో చిరంజీవికి జోడీగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...