పార్టీ జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్

-

హీరో విజయ్(Actor Vijay) గతేడాది తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు వెల్లడించారు. ‘తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam)’ పేరిట ఓ పార్టీని కూడా స్థాపించారు. కానీ తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయమని, నెక్స్ట్ ఎన్నికల్లో రంగంలోకి దిగుతామని అప్పట్లోనే ప్రకటించారు. అయితే తాజాగా విజయ్ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. అతడు తన సొంత పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరించారు. చెన్నైలోని తన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆడిటోరియం అంతా కరతాల ధ్వనులతో మారుమోగిపోయింది.

- Advertisement -

విజయ్(Actor Vijay) పార్టీ జెండా ఎరుపు, పసుపు రంగులతో ఉంది. పైన, కింద ఎరుపు రంగు ఉండగా, మధ్యలో పసుపు రంగు ఉంది. పసుపు రంగులో రెండు ఏనుగులు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు తన పార్టీ జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విజయ్ విడుదల చేశారు. త్వరలోనే పార్టీ రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహిస్తామని, అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. తమిళనాడు సంక్షేమం కోసం కృషి చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ఆ దిశగానే పని చేస్తానని మరోసారి పునరుద్ఘాటించారు.

Read Also: మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరాటం మొదలైంది: షర్మిల
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...