బ్రేకింగ్ మరో కమెడియన్ అనారోగ్యంతో మృతి….

బ్రేకింగ్ మరో కమెడియన్ అనారోగ్యంతో మృతి....

0
82

తెలుగు తమిళ్ చిత్ర పరిశ్రమలకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి… కొద్ది కాలంగా ప్రముఖ నటులు అనారోగ్యంతో మృతి చెందుతున్నారు… రెండు రోజులు క్రితం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.. కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఆయన తన నివాసంలో ఉంటున్నారు…

తాజాగా ఆయన గుండెపోటుతో మృతి చెందారు… ఇక ఈ షాక్ నుంచి కోలుకోక ముందే తమిళ నటుడు అనారోగ్యంతో మృతి చెందాడు… కొన్ని రోజులుగా వడివేల్ బాలాజీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు… తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు…

బాలాజీ వయస్సు 42 సంవత్సరాలు… ఆయనకు భార్య కుమారుడు కుమార్తె లు ఉన్నారు… బాలాజీ విజయ్ టీవీలో వచ్చే ఓ కామెడీ షో ద్వారా పాపులర్ అయి ఆ తర్వాత కొన్ని తమిళ్ సినిమాల్లో నటించాడు… ఆయన మృతిపట్ల ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..