తమిళ దర్శకుడి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్

తమిళ దర్శకుడి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్

0
95

ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న సినిమాలో నటిస్తున్నారు ..ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో చరణ్ కూడా నటిస్తున్నారు.
చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ నటి అలియా భట్ ఎంపిక కాగా, మరొక హీరోయిన్ కోసం ప్రస్తుతం చూస్తున్నారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ని కూడా ఫైనల్ చేశారు.. ఇక పలువురు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ నటులను సెలక్ట్ చేశారు.

తర్వాత ఎన్టీఆర్, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో, అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తారని కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళ టాప్ డైరెక్టర్ అట్లీతో కూడా సినిమా చేయాలని అనుకుంటున్నారట ..మంచి మాస్ సినిమా చేయాలని భావిస్తున్నారట ఎన్టీఆర్, అట్లీతో దీని గురించి చర్చించారు అని తెలుస్తోంది.మరి ఎన్టీఆర్ వీరి ఇద్దరి సినిమాలు తీశాక అట్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారా లేదా ముందా అనేది చూడాలి.