తమిళ హీరో విజయ్ తండ్రి కొత్త రాజకీయ పార్టీ- కీలక ప్రకటన చేసిన హీరో విజయ్

తమిళ హీరో విజయ్ తండ్రి కొత్త రాజకీయ పార్టీ- కీలక ప్రకటన చేసిన హీరో విజయ్

0
102

తమిళనాడులో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి, ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలకు తోడు ఈ ఎన్నికల్లో కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. కొద్ది రోజులుగా హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు అని వార్తలు వినిపించాయి, కాని అవేమి నిజం కాదు అని అన్నారు.

తాజాగా హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ సీనియర్ దర్శకుడు ఓ రాజకీయ పార్టీ ప్రారంభించారు, ఇప్పటికే రెండు రోజులుగా వార్తలు వినిపించాయి ,తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరిట ఓ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు విజయ్ తండ్రి. ఇది పూర్తిగా తన కార్యాచరణ అని, తన కుమారుడికి ఈపార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు.

అయితే దీనిపై విజయ్ కూడా మాట్లాడారు, మానాన్న పెట్టిన పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎవరి ఇష్టం వారిది, నేనుఎవరికి సపోర్ట్ చేయడం లేదు, నా తండ్రి పార్టీ కదా అని నా అభిమానులెవరూ అందులో చేరాల్సిన అవసరంలేదు, మీరు ఆ పార్టీకి నా గురించి పని చేయద్దు, ఇక ఆపార్టీలో వారు నా ఫోటోలు కూడా వాడుకోవద్దు అని తెలిపారు విజయ్.