ఆసుపత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో శింబు..ఆందోళనలో అభిమానులు

Tamil star hero Shimbu admitted to hospital

0
115

తమిళ హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వ్యక్తే. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి కూడా మంచి విజయాలను సాధించాయి. మన్మధ, వల్లభ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు శింబు.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న శింబు శనివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. కొన్ని వారాల పాటు బిజీగా ఉన్న శింబు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్‌ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

అయితే కరోనా అయ్యి ఉండవచ్చని ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది  కరోనా కాదని, సాధారణ ఇన్‌ఫెక్షనేనని వైద్యులు స్పష్టం చేశారు. శింబు అనారోగ్యం బారిన పడ్డారని తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.