మళ్ళీ వివాదంలో ఇరుక్కున్న తాప్సి.. ఈసారి మీడియా తో తగువు..!!

మళ్ళీ వివాదంలో ఇరుక్కున్న తాప్సి.. ఈసారి మీడియా తో తగువు..!!

0
97

తాప్సీ పన్ను తెలుగులో మంచుమనోజ్ హిరోగా నటించిన ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. వరుసగా అగ్రహిరోలతో నటించి బోలేడన్ని డిజార్స్టర్లను మూటకట్టుకుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ తన అదృష్టాన్ని పరిష్కించుకుంటుంది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం ఏరికోరి మ‌రీ కాంట్ర‌వ‌ర్సీల జోలికి వెళ్తుంది. తాజాగా ఓ మీడియా ఛానెల్‌ను టార్గెట్ చేసి ఫైర్ అయిపోయింది తాప్సీ. తాను చెప్పింది ఒక‌టి అయితే దాన్ని ప్ర‌సారం చేసింది మ‌రో విధంగా అంటూ రెచ్చిపోయింది తాప్సీ. అస‌లు చెప్పింది చెప్పిన‌ట్లు కాకుండా ఎవ‌రికి తోచిన‌ట్లుగా వాళ్లు రాస్తే ఎలా అంటూ వారిపై మండిప‌డింది ఈ భామ‌.

ఆ షోలో తన మాటలను పూర్తిగా వ‌క్రీక‌రించి ప్రేక్ష‌కుల‌కు చూపించార‌ని.. వాళ్ల టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలా ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాస్తూ చూపిస్తూ పోతే ఎలా అంటూ ఫైర్ అయింది తాప్సీ. ఈ మ‌ధ్యే కలర్స్ ఇన్‌ఫినిటీ అనే ఛానెల్లో ప్రసారమయ్యే ‘బీఎఫ్‌ఎఫ్‌ విత్‌ వోగ్‌’ షోలో తాప్సీతో పాటు యుఆర్ఐ హీరో విక్కీ కౌశల్ వ‌చ్చాడు. ఇందులో ఓ ప్ర‌శ్న తాప్సీకు ఎదురైంది. దానికి స‌మాధానంగా తాప్సీ ఏదో చెబితే.. ఆ స‌దరు ఛానెల్ మాత్రం ఒక్క విక్కీ తప్ప మగాళ్లంతా పనికిరాని వారే అని తాప్సీ చెప్పిన‌ట్లుగా ప్ర‌సారం చేసారు.

షూటింగ్‌‌కు ముందే తాప్సీ, విక్కీ ఫ్రెండ్స్ అని.. వాట్సాప్ ఛాట్ కూడా చేసుకుంటార‌ని ఛానెల్ వేసేస‌రికి తాప్సీకి కోపం న‌షాలానికి అంటేసింది. ఈ ఇద్ద‌రూ అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మన్‌మర్జియాన్‌ సినిమాలో న‌టించారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ జోడీకి మంచి మార్కులే ప‌డ్డాయి. మొత్తానికి తానొక‌టి మాట్లాడితే.. రేటింగ్స్ కోసం ఛానెల్ మ‌రోటి ప్ర‌సారం చేయ‌డంతో ఈ ముద్దుగుమ్మ‌కు ఎక్క‌డ లేని కోపం వ‌చ్చేసింది. ఈ భామ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. తాప్సీకి మ‌రికొంద‌రు సెల‌బ్రిటీస్ కూడా స‌పోర్ట్ చేస్తుండ‌టం విశేషం.