తారక్ మొత్తం ఆ నాలుగు కథలు ఒకే చేశారా – టాలీవుడ్ టాక్

తారక్ మొత్తం ఆ నాలుగు కథలు ఒకే చేశారా - టాలీవుడ్ టాక్

0
75

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు.. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల ఎప్పుడు చేస్తారో చిత్ర యూనిట్ ప్రకటించింది, అయితే తాజాగా ఈసినిమా గురించి అనేక వార్తలు వింటూనే ఉన్నాం.. క్లైమాక్స్ ఫైట్ సీన్లు కూడా షూట్ చేస్తున్నారు… ఇక జక్కన్న మరో రెండు నెలల్లో మొత్తం ఈ సినిమాని పూర్తి చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు.

 

ఇప్పటికే ఈ స్టోరీ ఒకే అయింది.. ఇక చిత్రం పై గతంలో ప్రకటన వచ్చేసింది, అయితే ఈ సినిమా తర్వాత కూడా తన తదుపరి సినిమాలు ఫిక్స్ చేసుకున్నారు అనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి, ముఖ్యంగా నాలుగు చిత్రాలు ఒకే చేశారు అని టాక్ నడుస్తోంది, ఇక త్రివిక్రమ్ చిత్రం పూర్తి చేసిన తర్వాత 2022 లో కొరటాల శివతో అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమాలు చేస్తారట.

 

ఇక తర్వాత ఏడాది కొత్త కథలకు సంబంధించి డేట్స్ ఇస్తారు అని తెలుస్తోంది… దాదాపు మరో రెండు సంవత్సరాల వరకూ తారక్ సినిమాలు ఒకే చేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి…. అయితే ప్రశాంత్ నీల్ సినిమా కొరటాల చిత్రం తర్వాత చేస్తారా లేదా బుచ్చిబాబు సినిమా తర్వాత చేస్తారా అనేది కూడా అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈ వార్త విని తారక్ ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు.