12 ఏళ్ల తర్వాత తారక్ సినిమా సరికొత్త రికార్డ్

12 ఏళ్ల తర్వాత తారక్ సినిమా సరికొత్త రికార్డ్

0
92

జూనియర్ ఎన్టీఆర్ పౌరాణికంలో కూడా అదరగొడతారు అని, అన్నీ జానర్స్ లో సినిమాలు చేయగల సత్తా అని నిరూపించిన చిత్రం యమదొంగ అనే చెప్పాలి. అప్పుడు దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం విడుదల అయి 12 సంవత్సరాలు అయింది ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కూడా దూసుకుపోయారు అనే చెప్పాలి. యమదొంగ ఇప్పుడు తమిళంలో అనువాదమవుతోంది. 2007లో విడుదలైన ఈ చిత్రంలో నటి ప్రియమణి, మలయాళ తార మమతా మోహన్‌దాస్‌లు హీరోయిన్లుగా నటించగా,

మంచు మోహన్‌బాబు, ఖుష్బూ, రంభ, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా గతంలో హిందీలో కూడా రిలీజ్ అయింది అనువాదంతో, తాజాగా విజయన పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు, ఏఆర్‌కే రాజరాజ సంభాషణలు రాశారు. అనువాద కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. శ్రీ సప్త కన్ని అమ్మన్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ మునీశ్వర మూవీస్‌ సంస్థ ఈ నెల 29వ తేదీన విడుదల చేయబోతోంది. మరి అక్కడ ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.