Taraka Ratna Health Bulletin: నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హార్ట్ స్ట్రోక్ కు గురైన తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కావడం లేదని.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల పాటు తారకరత్నకు చికిత్స అందించాలని పేర్కొన్నారు.
శుక్రవారం లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు తారకరత్న(Taraka Ratna)ను కుప్పంలోని పీఈఎస్ తరలించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం అర్థరాత్రి 2.30 గంటలకు పీఈఎస్ ఆసుపత్రి నుండి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలించారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆసుపత్రి నిపుణుల వైద్య బృందం తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. అయితే, తారకరత్న రక్త ప్రసరణ నాళాల్లో 90 శాతం బ్లాక్స్ ఉండటంతో స్టంట్స్ వేసిన డాక్టర్లు.. ఎక్మో అమర్చి వైద్యం అందిస్తున్నారు.