పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్. ప్రస్తుతం డైరెక్షన్ కి బ్రేక్ చెప్పి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నగరానికి ఏమైంది అంటూ గతేడాది ఓడ్డీ కామెడీ తీసిన సినిమా ఈ దర్శకుడికి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో డైరెక్షన్ కి బ్రేక్ చెప్పి హీరోగా వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పటికే సమ్మోహనం, మహానటి, ఫలక్ నుమా దాస్ సినిమాలో సహా నటుడిగా నటించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ నిర్మించిన నీకు మాత్రమే చెప్తా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నడు ఈ యంగ్ డైరెక్టర్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. తరుణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి ఏదేమైనా ఈ సినిమా హిట్ అయితేనే తరుణ్ కి మంచిది. లేదంటే హీరో గా ఎందుకు దర్శకుడిగా సినిమాలు చేసుకోవచ్చు గా అని కామెంట్ వస్తోంది. చూద్దాం మరి ఈ సినిమాతో దర్శకుడు హీరోగా హిట్ కొడతాడా..? కొట్ట డా..?