తరుణ్ ని పెళ్లిచేసుకుంటావా అని రోజారమణి ఆరోజు అడిగారు ప్రియమణి

తరుణ్ ని పెళ్లిచేసుకుంటావా అని రోజారమణి ఆరోజు అడిగారు ప్రియమణి

0
122

బాలనటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి లవ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన తరుణ్ టాలీవుడ్ లో సూపర్ ఫేమ్ సంపాదించుకున్నారు, నువ్వేకావాలి సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు, ఇక ఆయన తల్లితండ్రి ఇద్దరూ సినిమా పరిశ్రమకు చెందిన వారే, ఇంకా ఆయన వివాహం మాత్రం చేసుకోలేదు, అయితే తాజాగా తరుణ్ గురించి ప్రియమణి ఓ విషయం చెప్పారు ఏమిటంటే.

2005లో నవ వసంతం అనే సినిమా చేశారు ఇద్దరూ. అందులో ప్రియమణి హీరోయిన్. ఆ సమయంలోనే ప్రియమణి, తరుణ్ మధ్య ప్రేమ వ్యవహారం ఉంది అనే వార్తలు వినిపించాయి, అయితే తాజాగా దీని గురించి ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఈ సమయంలో ఓరోజు షూటింగ్ స్పాట్ కు తరుణ్ వాళ్ల అమ్మ వచ్చారు.. రోజా రమణి గారు షూటింగ్ స్పాట్కి వచ్చి నన్ను కలిశారు.

మీరిద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా?.. అదే నిజమైతే మీ పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఉంటే చెప్పేయండి అని అన్నారు. కాని మేము మంచి స్నేహితులం అంతే ఇక వరుసగా సినిమాలు చేయడం వల్ల ఇలాంటి కామెంట్లు పుకార్లు వచ్చాయని ఆమె తెలిపారు, రోజారమణి ఫ్రెండ్ కుమార్తెని తరుణ్ వివాహం చేసుకుంటారు అని ఇటీవల వార్తలు వినిపించాయి. దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు తరుణ్.