అ?అనే మూవీతో ప్రేక్షకుల్ని ఆహా అనేలా చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ …ఇండస్ట్రీ కి ఓ కొత్త టాలెంట్ వచ్చిందంటూ చాలా మంది అయన పై ట్వీట్స్ చేసారు . ఆ తర్వాత అయన రాజశేఖర్ తో తీసిన కల్కి మూవీ కూడా మంచి ఆదరణే పొందింది.. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ జంబి రెడ్డి పై అందరికి అంచనాలు ఎక్కువగా ఉన్నాయ్ . ఇందులో హీరో ఓ బాలనటుడు అంటూ అయన చేసిన వాక్యాలకు సినిమా ప్రేమికులు అతను ఎవరో కరెక్ట్ గెస్ చేయలేకపోయారు .
అయితే ఈ సస్పెన్సు కి తెరదించుతూ అయన తన మూవీ పోస్టర్ ను రిలీజ్ చేసారు . ఇంద్ర లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో బాలనటుడిగా నటించిన తేజ సజ్జ ఈ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . చిరు బొమ్మతో వేసుకున్న షర్ట్ తో ఉన్న ఈ మాస్ లుక్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి ..ఓ బేబీ మూవీ తో మంచి కంబ్యాక్ ఇచ్చిన తేజ ఈ మూవీ తో హీరోగా నిలదొక్కుకుంటాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు .
ఎపుడు సస్పెన్సు తో జనాల్ని ఆకట్టుకునే ప్రశాంత్ వర్మ తన టైటిల్ తోనే సినిమాపై హైప్ పెంచేసాడు .. రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు ..