తేజ రానా మరో కొత్త మూవీ టైటిల్ ఇదే

తేజ రానా మరో కొత్త మూవీ టైటిల్ ఇదే

0
97

నేనేరాజు నేనేమంత్రి సినిమా రానాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో తెలిసిందే.. ఈ సినిమా విజయం రానాకి మంచి జోష్ ఇచ్చింది, అంతేకాదు డైరెక్టర్ తేజ కూడా ఈ సినిమాపై ఎంతో హోప్స్ పెట్టుకున్నారు.. అలాగే హిట్ అయింది ఈ సినిమా… తాజాగా ఈ ఇద్దరికి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది, మరో సినిమా చేసేందుకు వీరు కాంబో రెడీకి అవుతున్నారట.

రానా ప్రధాన పాత్రధారిగా తేజ ఒక విభిన్నమైన కథను రెడీ చేసుకున్నాడట. ఈ సినిమాలో రానా పాత్రను చాలా విలక్షణంగా డిజైన్ చేశాడని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన రాక్షస రాజ్యంలో రావణాసురుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడట. అయితే టైటిల్ వినడానికే చాలా వెరైటీగా ఉంది ఇక కథ ఎలా ఉంటుందా అని టాలీవుడ్ లో చర్చ అయితే జరుగుతోంది.

ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమాను పూర్తిచేసే పనిలో వున్నాడు. ఆ తరువాత ఆయన హిరణ్యకశిప చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి తేజ సినిమా ఎప్పుడు చేస్తాడనేది చూడాలి. అయితే ఈ సినిమా నిర్మాణం కూడా సురేష్ ప్రొడక్షన్స్ చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి.. అన్నీ సెట్ అయితే వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అంటున్నారు.