ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ‘హనుమాన్’ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్.. పాటలు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్(Hanuman Trailer) విడుదలైంది. స్టన్నింగ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో చూపించిన గ్రాఫిక్స్, విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి.
ఓ పల్లెటూరులో ఉండే హీరోకి సూపర్ పవర్ ఉంటుంది. మరోవైపు పవర్ సూట్‌లో ఉంటే సరిపోదు నాలో ఉండాలి. నా నరనరాల్లో ఉండాలని విలన్ భావిస్తూ ఉంటాడు. ఆ శక్తి సామర్థ్యాలు హీరో దగ్గరి ఉన్నాయని తెలిసి అతడిపై దాడి చేస్తాడు. అనంతరం హీరోని హనుమంతుడు ఎలా కాపాడాడనేది చూపించారు. చివర్లో మానవాళి మనుగడను కాపాడటానికి నీ రాక అనివార్యం హనుమా అనే డైలాగ్ ట్రైలర్(Hanuman Trailer)కు హైలైట్‌గా నిలిచింది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, చైనీస్, జపాన్ మొత్తం 11 భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో, విలన్‌గా వినయ్ రాయ్ నటిస్తున్నారు.