‘ఆదిపురుష్’ టీంకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

-

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్(Adipurush). ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదల కానుంది. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆదిపురుష్(Adipurush) మూవీ యూనిట్‌కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అందుకు సంబంధించి తాజాగా ఓ జీవోను కూడా విడుదల చేసింది. అగ్ర హీరోల సినిమాలు విడుదలైనప్పుడు నిబంధన ప్రకారం మొదటివారం టికెట్ రేట్స్ పెంచుకునేలా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో ఓ టికెట్ పై రూ.50 రూపాయలను అదనంగా పెంచింది. ఇందుకు మొదటి మూడు రోజులు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

Read Also:
1. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘OG’ అప్‌డేట్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...