ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju)కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఆయన విశేష సేవలందిస్తున్న క్రమంలోనే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(TFDC) ఛైర్మన్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి(CS Shantha Kumari) విడుదల చేశారు. ఈ పదవిలో దిల్ రాజు.. రెండేల్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అతి త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
అయితే ప్రస్తుతం దిల్ రాజు(Dil Raju).. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోతో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో పాటుగా వెంకటేష్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. వీటితో పాటు పలు ఇతర సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.