Premiere Shows | సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం ఝలక్.. బెనిఫిట్ షోలపై కీలక నిర్ణయం..

-

బెనిఫిట్ షోల(Premiere Shows)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యథియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రెండు ప్రాణాలు పోవడంతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇకపై రాష్ట్రంలో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ మేరకు నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

‘‘ఇక నుంచి తెంగాణలో బెనిఫిట్ షోల(Premiere Shows)కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులివ్వం. ఎంతటి భారీ బడ్జెట్ సినిమా అయితే ఆదయం ఆట నుంచే షోస్ వేయాలి’’ అని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రానున్న స్టార్ హీరోల సినిమాలకు భారీ ఎదురుదెబ్బ కానుంది. సినిమాల ఆదాయాల కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇదిలా ఉంటే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్(Allu Arjun), ఆయన టీమ్, థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. అల్లు అర్జున్ రానున్నట్లు పోలీసులకు తెలియదని, థియేటర్ యాజమాన్యం కూడా ఈ సమాచారాన్ని తమకు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా భారీగా ప్రేక్షకులు అక్కడకు చేరిన క్రమంలో థియేటర్ ఎంట్రన్స్, ఎగ్జిట్‌లలో సరైన భద్రత కూడా ఏర్పాటు చేయలేదని, ప్రైవేటె సెక్యూరిటీని కూడా నియమించుకోలేదని అక్షాంశ్ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అయితే బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఇప్పటికే ప్రకటించింది.

Read Also: కీర్తి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...