Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

-

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణలో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్‌ను కొట్టేసింది న్యాయస్థానం(TG High Court). ఈ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన మానసిక, నరాల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

- Advertisement -

ఆయన ప్రస్తుతం తిరుపతి(Tirupati)లో ఉన్నారని చెప్పారు. మనవడిని చూడటం కోసం దుబాయ్ వెళ్లారని, అక్కడి నుంచి నేరుగా తిరుపతికి చేరుకుని అక్కడ విద్యాసంస్థల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని మోహన్ బాబు(Mohan Babu) తరపు న్యాయవాది తెలిపారు. అంతేకాకుండా గాయపడిన విలేకరి మోహన్ బాబుకు తెలియను కూడా తెలియదని, అలాంటప్పుడు హత్యాయత్నం కేసు ఎలా పెడతారని, ఆ సెక్షన్‌లు ఈ కేసుకు వర్తించవని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అనంతరం తన వాదనలను వినిపించడం ప్రారంభించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఈ ఘటనపై తొలుత పహడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారని ఆతర్వాత బాధితుడి వాంగ్మూలం ప్రకారం సెక్షన్లు జోడించడం జరిగిందని చెప్పారు. ఈ కేసులో మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిందేనని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఈ వాదనల అరనతరం ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.

Read Also: చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...