పుష్ప సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ సినిమాలోని తగ్గేదేలే డైలాగ్, ఐటెం సాంగ్, శ్రీవల్లి సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ తెలంగాణ గాయకుడు సాయి చంద్ పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హౌలేగాళ్లను తగ్గేదే లేదు అంటూ హీరోలు చేసిన తర్వాత పిలగాళ్లను కంట్రోల్ చేసుడు కష్టమైందని.. ఈ సినిమాలను తీసే ఎదవలను చెప్పుతో కొట్టాలి ఫస్ట్ అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఓ స్మగ్లర్ ని హీరోగా చిత్రీకరించడమేంటనే వాదన కూడా ఉంది. ఇటీవల ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి కూడా పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుష్ప సినిమాపై తెలంగాణ గాయకుడు సంచలన వ్యాఖ్యలు
Telangana singer sensational comments on the movie Pushpa