100 Cr Club Movies | తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలుగా అలరిస్తున్నాయి. బడ్జెట్ పెరగడమే కాదు కలెక్షన్స్ కూడా దుమ్మురేపుతున్నాయి. సునాయాసంగా రూ.100కోట్ల షేర్‌ను రాబడుతున్నాయి. ‘బాహుబలి’తో మొదలైన ఈ రూ.100కోట్ల షేర్ క్లబ్‌లోకి ఇప్పుడు ‘హనుమాన్’ కూడా చేరింది.
‘బాహుబలి-1’తో ప్రభాస్ 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని రూ.300 కోట్ల షేర్ అందుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాతో రూ.216 కోట్లకు పైగా కలెక్షన్స్ పొంది రూ.100 కోట్ల షేర్ హీరోగా నిలిచారు. ‘భరత్ అనే నేను’ చిత్రంతో రూ.225 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని రూ.100 కోట్ల షేర్ క్లబ్‌లోకి మహేష్ చేరారు. అయితే అప్పటి నుంచి వరుసగా ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కార్ వారి పాట’ ‘గుంటూరు కారం’ వరకు ఐదు సినిమాలు ద్వారా రూ.100కోట్ల షేర్ రాబట్టిన ఏకైక హీరోగా నిలిచారు.
100 Cr Club Movies | ఇక అల్లు అర్జున్ ‘అలవైకుంఠపురములో’ సినిమాతో రూ.260 కోట్ల గ్రాస్‌తో రూ.100కోట్ల షేర్ క్లబ్‌లోకి అడుగుపెట్టారు. తర్వాత ‘పుష్ప’; సినిమాతో ఇది కంటిన్యూ చేశారు. అటు ‘ఆర్ఆర్‌ఆర్’ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కూడా రూ.100 కోట్ల షేర్ క్లబ్‌లోకి అడుగుపెట్టారు. గతేడాది మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో రూ.225 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రూ.100 కోట్ల షేర్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన మొదటి సీనియర్ హీరోగా నిలిచారు. ఇప్పుడు యువ హీరో తేజ సజ్జ ‘హనుమాన్’ మూవీ ద్వారా రూ.100కోట్ల షేర్ క్లబ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఈ క్లబ్‌లోకి అడుగుపెట్టిన మొదటి యువ హీరోగా తేజ నిలిచాడు.