తెలుగు బిగ్ బాస్- 4 పై సరికొత్త అప్ డేట్

తెలుగు బిగ్ బాస్- 4 పై సరికొత్త అప్ డేట్

0
85

తెలుగులో బిగ్ బాస్ మూడు సీజన్స్ పూర్తి అయ్యాయి, మరి ఈ జూన్ జూలై వచ్చింది అంటే కచ్చితంగా బిగ్ బాస్ గురించి చర్చ ఉంటుంది, మరి ఇప్పటికే పూర్తిగా అన్నీ ప్రిపేర్ అయి సెట్ వేసే పనిలో ఉంటారు బిగ్ బాస్ నిర్వహకులు, సెలక్షన్ కూడా అయిపోతుంది, మరి ఈసారి వైరస్ లాక్ డౌన్ తో ఈ పని ఎంత వరకూ వచ్చింది అనే వార్తలు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు.

గత సీజన్ను నాగార్జున హోస్ట్ చేయ్యగా.. అంతకు ముందు నాని, ఎన్టీఆర్లు తమ యాంకరింగ్తో సందడి చేశారు. మరి ఈసారి ప్రిన్స్ పేరు వినిపిస్తోంది, అలాగే మరోసారి నాగ్ పేరు వినిపిస్తోంది, ఇక పలువురు నటులు యాంకర్లు ఈ రియాల్టీ షోకు సిద్దం అవుతున్నారట.

కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్బాస్ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి, కాని అలాంటి డౌట్ అక్కర్లేదు, ఈ సీజన్ షో ఉంటుంది అని అంటున్నారు, ఇప్పటికే కొందరిని ఫైనల్ చేశారట.ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆగస్టు నుండి ప్రారంభంకానుందని తెలుస్తోంది.. మరి వీరేనా లేదా కొత్త వారి పేర్లు వస్తాయా చూడాలి.