తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 – ఈసారి నాగ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Telugu Bigg Boss Season 5 - Do you know much about Nagarjuna Remuneration this time?

0
102

తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5 నిన్న ప్రారంభం అయింది. మొత్తం 19 మంది సభ్యులని ఇంటిలోకి పంపించారు. ఇక ఒక్కొక్కరు తమ ఆటతో ఎలా ఎంటర్ టైన్ చేస్తారో చూడాలి. ఇక హోస్ట్ గా నాగార్జున అదరగొట్టేశారు. సీజన్ 3 సీజన్ 4 ఆయన చేశారు ఇక సీజన్ 5 కూడా ఆయనే చేసి బిగ్ బాస్ లో కింగ్ అనిపించుకున్నారు. ఇక సీజన్ 3 నుంచి ఆయన హ్యాండిల్ చేసే విధానం కూల్ గా చెప్పడం ఇవన్నీ ప్రేక్షకులకి కూడా బాగా నచ్చాయి.

ఇక తాజాగా నాగార్జున రెమ్యునరేషన్ గురించి టాలీవుడ్ లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. సీజన్ 3 సీజన్ 4 కంటే కింగ్ కు ఈసారి భారీ రెమ్యునరేషన్ అందుతుంది అంటున్నారు. ఇక దాదాపు 10 నుంచి 12 కోట్ల రెమ్యునరేషన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఏషో చేసినా సూపర్ హిట్ అందుకే నిర్వాహకులు ఆయన ఎంత కోరినా ఇచ్చేందుకు ఒకే అంటారు అని చెబుతున్నారు ఫ్యాన్స్ .

అంతకు ముందు నాగ్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు చాలా పెద్ద హిట్.. అలాగే బిగ్బాస్ సీజన్ 3, సీజన్ 4 కూడా పెద్ద హిట్.
ఇక 15 వారాలు ఈ షో నడుస్తుంది డేట్స్ ఎక్కువ కేటాయించాలి అలాగే ఈసారి కూడా షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా నాగార్జున పక్కా ప్లాన్ తో వెళుతున్నారట.