తెలుగు హీరోలపై శ్రుతి హాసన్ ఆశ్చర్యకరమైన కామెంట్స్

తెలుగు హీరోలపై శ్రుతి హాసన్ ఆశ్చర్యకరమైన కామెంట్స్

0
118

తెలుగులో అందాల తారల పేర్లు చెప్పగానే వారిలో ముందు వినిపించే పేరు , కుర్రకారు మనసు కొల్లగొట్టిన బ్యూటీ పేరు శ్రుతి హాసన్ అనే అంటారు, అయితే తండ్రి నుంచి సినిమా వారసత్వం తీసుకున్న శ్రుతి హాసన్ తనకు వచ్చిన ప్రతీ పాత్రలో అద్బుతమైన నటన డ్యాన్స్ చేసింది.. తెలుగులో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది అగ్ర నటులు దర్శకులతో ఆమె వర్క్ చేసింది.

ముఖ్యంగా ఆమె నాజూకుదనానికి కుర్రకారు ఫిదా అయ్యారు. అయితే కొద్ది కాలంగా ఆమె బాలీవుడ్ లో బాగా బిజీ అయింది మళ్లీ తాజాగా తెలుగులో సినిమాలు చేసేందుకు ఒకే చెప్పింది.. తాజాగా రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటిస్తోంది, దీంతో శ్రుతి హాసన్ అభిమానులు మళ్లీ తెలుగులో బంపర్ హిట్ కు రెడీ అని అంటున్నారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది… తెలుగులో నాకు మంచి హిట్స్ పడ్డాయి. ముఖ్యంగా ఆ సినిమాల్లో శ్రీమంతుడు….రేసుగుర్రం…..బలుపు చిత్రాలు ఉన్నాయి… ఇక తెలుగులో తాను నటించిన సినిమాల్లో గబ్బర్ సింగ్ స్థానం ప్రత్యేకం.. ఆ సినిమా నాకు చాలా నచ్చిన చిత్రం అని చెప్పింది, ఇక మహేష్ బాబు చాలా అందగాడు అని, అలాగే పవన్ స్టైలిష్ పర్సెన్ అని చెప్పింది , ప్రభాస్ హైట్ లో తనకి పోటీ లేదు అని చెప్పింది, ఇక బన్నీ కూడా అంకితభావం కలిగిన నటుడు అని చెప్పింది ఈ భామ.