థమన్ ని వదలని కాపీ మారక.. సామజవరగమన కూడా..!!

థమన్ ని వదలని కాపీ మారక.. సామజవరగమన కూడా..!!

0
111

త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం అల.. వైకుంఠపురంలో… ఇప్పటికే త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు రాగా..ఇప్పుడు అల వైకుంఠపురంలో మూవీ రావడంత ఫ్యాన్స్ లో అంచనాలు బాగానే ఉన్నాయి.. ఇకపోతే బన్నీ నటిస్తున్న 19వ సినిమా ఇది.

పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం వహిస్తున్నాడు.. ఇటీవలే ఈ సినిమా నుంచి సామజవరగమన సాంగ్ వచ్చేసింది. రికార్డు వ్యూస్ ని సొంతం చేసుకొంది. ఐతే, అంతా సైరా మూడ్ లో ఉండగా.. ఈ సాంగ్ వచ్చి డిస్ట్రబ్ చేసిందని మెగా అభిమానులు అంటున్నారు. ‘సైరా’ ఫీవర్‌ బాగా ఉన్న టైమ్‌ లో అల్లు అర్జున్‌ సినిమా పాటని అంత అర్జంటుగా విడుదల చేయాల్సిన అవసరం ఎముంది అంటూ కొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు. దీనితో అల్లు అర్జున్‌ ‘సైరా’ మ్యానియాను తాను లెక్క చేయడంలేదు అంటూ సంకేతాలు ఇవ్వడానికి ఇలా తన వంతు ప్రయత్నంగా ఈపాటను విడుదల చేసాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.