తన బయోపిక్ తానే తీస్తున్న వర్మ … టైటిల్ తెలుసా ..

తన బయోపిక్ తానే తీస్తున్న వర్మ ... టైటిల్ తెలుసా ..

0
83

ఇప్పటిదాకా వేరే వాళ్ళ బయోపిక్ లు తీసిన వర్మ ఇప్పుడు తన బయోపిక్ తానే తీస్తూ మరో సంచలనానికి తెర లేపాడు .బొమ్మకు క్రియేషన్స్ ఈ బయోపిక్ నిర్మాణ బాధ్యతలు తీసుకోగా దొరసాయి తేజ అనే నూతన దర్శకుడు ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు .

ఈ సినిమా గురించి రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ ఇది 3 పార్టులుగా ఉంటుందని చెబుతున్నారు . సంచలనందర్శకుడుగా పేరు సంపాదించిన దగ్గరనుండి వివాదానికి కేర్ అఫ్ అడ్రెస్స్ గ మారిన వరకు ఒక పార్టు ,, బూతు సినిమాల డైరెక్టర్ గ జనాల్లో ముద్ర వేసుకున్న పరిణామాలన్నీ ఒక పార్టులోనూ ఉంటాయని అయన చెబుతున్నారు

అయితే మొదటి పార్టు కి రాము అన్న టైటిల్ ని ఫిక్స్ చేసిన వర్మ మిగతా రెండు పార్టుల టైటిల్స్ తొందర్లోనే చెప్తానని అంటున్నారు . ఒక వివాదం యొక్క కథ జనాలకి ఎంత వినోదం పంచుతుందో చూడాలి మరి …