తన బాడీ గార్డ్ కుటుంబానికి సల్మాన్ ఖాన్ ఏం చేస్తున్నారో తెలుసా

తన బాడీ గార్డ్ కుటుంబానికి సల్మాన్ ఖాన్ ఏం చేస్తున్నారో తెలుసా

0
98

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సాయం కోరి ఎవరు వచ్చినా కాదు అనకుండా సాయం చేస్తారు..

బీయింగ్ హ్యూమన్ అనే సంస్ద ద్వారా బాలీవుడ్ స్టార్ ఎంతో మందికి సాయం చేస్తున్నారు, అయితే ఇలా సాయం చేయడంలో బాలీవుడ్ లో ఆయనే ముందు ఉంటారు, సినిమా నటులకి అభిమానులకి చిరు ఉద్యోగులకి కార్మికులకి ఇలా ఎంతో మందికి సాయం చేస్తారు… ఇక లాక్ డౌన్ వేళ చిత్ర సీమలో చాలా మందికి సాయం చేశారు ఆయన.

 

షేరా అనే వ్యక్తి గత 26 ఏళ్లుగా సల్మాన్ కు బాడీగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక సల్మాన్ ఎక్కడకు వెళ్లినా షేరా ఆయనతోనే ఉంటారు, ఇక మంచి మిత్రుడిగా ఆయనతో ఉంటారు..షేరా అంటే సల్మాన్ కు అమితమైన అభిమానం. ఆయన కొడుకును బాలీవుడ్ కు పరిచయం చేస్తానని సల్మాన్ ఎప్పుడో ప్రకటించారు.

 

ఈ కరోనా మహమ్మారి లేకపోతే షేర్ కొడుకు టైగర్ ను ఎప్పుడో పరిచయం చేసేవాడు సల్మాన్… అయితే

తన సొంత బ్యానర్ ద్వారా హీరోగా సల్మాన్ పరిచయం చేయబోతున్నారట. దీనిపై షేరా స్పందించారు కరోనా లేకపోతే తన కొడుకుకు సంబంధించి ఇప్పటికే ప్రకటన వచ్చుండేదని తెలిపాడు. తనని సల్మాన్ సొంత కుటుంబ సభ్యుడిగా చూస్తారు అని తెలిపారు షేరా.