తన మనసులో మాట చెప్పిన పవన్ కల్యాణ్

తన మనసులో మాట చెప్పిన పవన్ కల్యాణ్

0
81

టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ పింక్ సినిమా రిమేక్ చేస్తారని, దిల్ రాజ్ బోనీకపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తారని దర్శకుడు వేణుశ్రీరామ్ అని అనేక వార్తలు వినిపించాయి.. ఏకంగా నవంబర్ 15 సినిమా షూటింగ్ పక్కా అని అన్నారు.. కాని అసలు వాస్తవానికి అలాంటివి ఏమీ జరగలేదు, అయితే అసలు పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తారా రాజకీయాల్లోనే కొనసాగుతారా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో పవన్ కల్యాణ్ సినిమా గురించి ఆయన అభిమానులే కాదు యావత్ టాలీవుడ్ పరిశ్రమ అంతా ఎదురుచూస్తోంది.

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న క్రైమ్, డ్రామా మూవీ పింక్ ..ఇది పవన్ కు బాగా సూట్ అయ్యే కథ అని అంటున్నారు. కాని తాజా సమాచారం ప్రకారం, పవన్ చేయబోయే సినిమా ఇది కాదని తెలుస్తోంది. అవును పవన్ మదిలో వేరే ఆలోచన ఉంది అని తెలుస్తోంది. డైరెక్ట్ కథతో రీఎంట్రీ ఇవ్వాలని మనసులో ఉన్నట్లు చెప్పారట పవన్.

అందుకే తనకు మంచి కథని సిద్దం చేయాలి అని తన సన్నిహిత దర్శకులకు తెలియచేశారట.. అది కూడా గ్రాండ్ ఓపెనింగ్ ఉండాలి అని చెప్పారట..అందుకే బోనీ కపూర్ దిల్ రాజ్ బ్యాక్ స్టెప్ వేశారు అని తెలుస్తోంది. సో చూడాలి మరి ఈ పింక్ ఎవరు తీస్తారో ? అసలు పవన్ ఏ కథ సెలక్ట్ చేసుకుంటారో.