తన తదుపరి చిత్రం గురించి నిఖిల్ సంచలన కామెంట్స్

తన తదుపరి చిత్రం గురించి నిఖిల్ సంచలన కామెంట్స్

0
101

అర్జున్ సురవరం మంచి లైన్ కాన్సెప్ట్ అనే చెప్పాలి.. అద్బుతమైన మీడియా కాన్సెప్ట్ తో సినిమాని తెరకెక్కించారు.. ఇందులో నిఖిల్ నటనపై అందరూ శభాష్ అంటున్నారు. ఆయనకు అభినందనలు వస్తున్నాయి… ఇక తన సినిమాలు వరుసగా జోరుమీద ఉంటాయి అని చెబుతున్నారు నిఖిల్.
నిఖిల్ తర్వాత నాలుగు సినిమాలు ప్లాన్ చేశారట. తాజాగా ఈ విషయాన్ని తెలియచేశారు, కాస్త విభిన్నమైన కాన్సెప్ట్ తో సినిమాలు చేయబోతున్నారు.. ఆయన అభిమానులకు తన కొత్త సినిమాల గురించి తెలియచేశారు. ప్రస్తుతం ఆయన కార్తికేయ సీక్వెల్ 2 చిత్రం చేస్తున్నారు.
అలాగే గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ సంస్థలతో కలిసి ఒక చిత్రం చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు వచ్చే సంవత్సరం విడుదలకానున్నాయి. మరో రెండు చిత్రాలను సీనియర్ దర్శకులతో ప్లాన్ చేస్తున్నారు. అవి రెండు రైటింగ్స్ లో ఉన్నాయి అని తెలుస్తోంది