Thangalaan: తంగలాన్‌తో వస్తున్న విక్రమ్‌

-

Thangalaan: విక్రమ్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేసే విధంగా తీర్చిదిద్దనున్నారు. విక్రమ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతుంది. విక్రమ్‌ సరసన మాళవిక మోహనన్‌ నటించనున్నారు. చిత్ర యూనిట్‌ హామీ ఇచ్చినట్లుగానే.. నేడు సినిమా టైటిల్‌ను తంగిలాన్‌ అని అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటు సినిమాలోని గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌ ప్రకారం చూసుకుంటే, సినిమా స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథాంశంతో ఉన్నట్లు ఉంది. విక్రమ్‌ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో కనివిందు చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తామని Thangalaan చిత్ర బృందం తెలిపింది. విభిన్న చిత్ర నిర్మాణానికి పా.రంజిత్‌ పెట్టింది పేరు.. అలాగే. విభిన్న పాత్రల్లో వైవిధ్యంగా నటించే చియాన్‌ విక్రమ్‌.. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు సైతం భారీ రెస్పాన్స్‌ వస్తోంది.

- Advertisement -

Read also: వైమానిక ఇంధన డిపోను పేల్చిన రష్యా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...