ఓటీటీలో చైతూ ‘థాంక్యూ’ మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

0
118

అక్కినేని యువ హీరో నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ’. ఫీల్ గుడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. చై సరసన ముగ్గురు హీరోయిన్లు నటించారు. July 22, 2022 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందన కనబరిచింది.

ఈ సినిమాకు సంబంధించి ఓటిటి డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైమ్‌ వాళ్లు కొనుగోలు చేసారు. ఇక ఈ క్రమంలోని ఆగస్టు 11వ తేదీ నుంచి అమెజాన్ లో ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సినిమాలో అభిరామ్ పాత్ర‌లో నాగ చైత‌న్య ఒదిగిపోయాడు. ఆయన పాత్రకి చాలా వేరియషన్స్‌ ఉంటాయి. అన్నింటిని చక్కగా డీల్‌ చేశాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఒదిగిపోయాడు.  చైతూ- మాళవికా నాయర్‌లా కెమిస్ట్రీ తెరపై వర్కౌట్‌ అయింది. చిన్నూగా అవికా ఘోర్‌ తన పాత్ర పరిధిమేర నటించింది.

https://twitter.com/TheAakashavaani?