తార‌క్ కు త‌న మ‌న‌సులో మాట చెప్పిన వెంక‌టేష్

తార‌క్ కు త‌న మ‌న‌సులో మాట చెప్పిన వెంక‌టేష్

0
90

విక్ట‌రీ వెంకటేశ్ పుట్టినరోజున తాజాగా ఆయ‌న న‌టించిన వెంకీ మామ చిత్రం విడుద‌ల అయింది.వెంకటేశ్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అనుకున్న‌ట్లే సినిమా హిట్ అయింది, ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా సినిమా అభిమానుల‌కు న‌చ్చింది.
తాజాగా వెంకీ మామ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంలో ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి వెంకటేశ్ ప్రస్తావించారు. ఈ ఏడాది వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 నాగచైతన్య తో కలిసి వెంకీమామ చేసే అవకాశం వచ్చింది. అని త‌నకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పారు.

అయితే ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల‌తో మల్టీస్టారర్ సినిమాలు చేయాలనుంది అన్నారు వెంకీ. ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయాలనుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ స్టైల్ ను .. డాన్సింగ్ స్టైల్ ను నేను బాగా ఇష్టపడతాను. మంచి కథ కుదిరితే ఆయనతో కలిసి నటించాలనుంది అంటూ త‌న మ‌న‌సులో మాట‌ని చెప్పేశాడు విక్ట‌రీ వెంక‌టేష్ …ఇక ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులు మంచి క‌థ రెడీ చేయండి అంటున్నారు ఇరువురి అభిమానులు. కొద్ది రోజుల్లోనే అసురన్ రీమేక్ సెట్స్ పై పెట్ట‌నున్నారు విక్ట‌రీ వెంక‌టేష్.