సమంత సంచలన నిర్ణయం వెనుక ఆ హీరో?

That hero behind Samantha's sensational decision?

0
79

ఇటీవలి కాలంలో హీరోయిన్ సమంత పేరు మారుమోగుతోంది. దీనికి నాగచైతన్యతో విడిపోవడం ఓ కారణమైతే, నటి చేస్తోన్న సినిమాలు మరో కారణంగా చెప్పవచ్చు. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో వేగాన్ని తగ్గించిన సమంత కేవలం కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితమైంది. అయితే తాజాగా విడాకుల నిర్ణయం తర్వాత సినిమాలతో బిజీగా మారిపోయింది.

కొత్త కొత్త పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తెలుగులో కొన్ని సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ పలు అవకాశాలను కొట్టేసిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా ఈ అందాల తార మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రీసెంట్‌గా ఆమె ‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’ అనే అంత‌ర్జాతీయ సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. చిత్ర యూనిట్ కానీ, స‌మంత చెప్ప‌లేదు కానీ.. ఇందులో ఆమె ఎవ‌రూ ఊహించ‌ని రోల్‌ను చేస్తుంది. అదే బై సెక్సువ‌ల్ రోల్‌. ఓ స్టార్ హీరోయిన్ అలాంటి పాత్ర‌లో న‌టించ‌డ‌మంటే ఆమెను అప్రిషియేట్ చేయ‌కుండా ఉండ‌లేరు.

‘అరెంట్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌’ చిత్రాన్ని జాన్ పిలిప్ డైరెక్ట్ చేస్తున్నారు. గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు. అయితే ప‌ర్టికుల‌ర్‌గా బై సెక్సువ‌ల్ రోల్‌లో ఎవ‌ర్నీ న‌టింపచేయాల‌ని మేక‌ర్స్ ఆలోచిస్తుండ‌గా రానా ద‌గ్గుబాటి స‌మంత పేరుని సూచించాడ‌ట‌. ఆమె అయితే న్యాయం చేస్తుంద‌ని రానా చెప్ప‌డంతో మేక‌ర్స్ స‌మంత‌ను అప్రోచ్ అయ్యారు. క‌థ విన్న స‌మంత న‌టించ‌డానికి వెంట‌నే ఓకే చెప్పింది. అలా స‌మంత కెరీర్‌లో అంతర్జాతీయ సినిమాను ఎంపిక చేసుకునే సంచ‌ల‌న నిర్ణ‌యం వెనుక కార‌ణంగా నిలిచిన హీరో రానా ద‌గ్గుబాటి అని వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారికంగా ఎవరో ఒకరు స్పందించాల్సిందే.