టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అంటే సమంత నాగ చైతన్య పేరు ముందు చెబుతారు, ఓ పక్క ఇద్దరూ చిత్ర సీమలో బీజీగా ఉన్నారు, ఇక అక్కినేని వారి కోడలు సమంత సినిమాలు షోలతో పాటు కొత్త ఫ్యాషన్ క్లోత్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది, వ్యాపారంలో మామకు తగ్గ కోడలు అనిపించుకుంటోంది.
చైతు సమంత పదేళ్ల కింద పరిచయం అయినా మూడేళ్ల కింద ఒక్కటయ్యారు ..ఏ మాయ చేసావే సినిమాతో పరిచయం అయిన సమంత అక్కడ నుంచి చైతూని వదలలేదు, ఇక ఇద్దరూ గాడంగా ప్రేమించుకున్నారు, అయితే వీరి పెళ్లికి ఓ హీరో కారణం అని తెలుస్తోంది.
సమంత, చైతూ ప్రేమించుకున్న విషయం తెలుసుకున్న తర్వాత కుటుంబాల్లో ఒప్పించడానికి తనవంతు ప్రయత్నం చేసింది రానా దగ్గుబాటి., తాజాగా ఈ విషయాన్ని సమంత తెలిపింది, ఈ మధ్య రానా సామ్ జామ్ షోకు వచ్చారు, ఈ సమయంలో రానాకి సమంత కృతజ్ఞతలు తెలిపింది ..మీరు లేకపోతే చైతూతో తన పెళ్లి అయ్యుండేది కాదని సమంత తెలిపింది, ఇక రానా చైతూ ఇద్దరూ కూడా చిన్నతనం నుంచి మంచి ఫ్రెండ్స్ అనేది తెలిసిందే.