యాంగ్రీయంగ్మెన్గా ప్రేక్షకుల హృదయాల్లో మంచి గుర్తింపు పేరు సంపాదించారు హీరో రాజశేఖర్, మొత్తానికి ఆయన చేసిన పోలీస్ పాత్రలు ఆయనకు ఎంతో ఫేమ్ తీసుకువచ్చాయి.. ఇక ఆయనకు వచ్చిన అనేక విభిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ లో మంచి హీరోగా పేరు సంపాదించారు. అయితే ఆయన కెరియర్లో అల్లరి ప్రియుడు చిత్రం సూపర్ హిట్ అనే చెప్పాలి.
ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులని యూత్ ని బాగా ఆకట్టుకుంది, ఇక కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ అద్భుతమైన ప్రేమకథ అప్పట్లో సంచలన విజయం సాధించింది. కీరవాణి బాణీలు సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి, ఇక సీరియస్ పాత్రలతో కనిపించే రాజశేఖర్ ఇలా సరదాగా కనిపించడం లవ్ ఓరియెంటెడ్ చిత్రం చేయడంతో మహిళలకు ఫేమస్ హీరో అయ్యారు.
అయితే ఈ సినిమా రాజశేఖర్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అప్పట్లో యాక్షన్, ఫ్యామిలీ హీరోగా మంచి ఫామ్లో ఉన్న సుమన్ను హీరోగా తీసుకోవాలి అని భావించారు.. కాని సుమన్ కు అప్పుడు అనుకోని కొన్ని సమస్యలు రావడంతో ఈ సినిమా రాజశేఖర్ కు వెళ్లిందట, ఈ సినిమా మాత్రం ఆయన కెరియర్లో టాప్ చిత్రం అనే చెప్పాలి..