బంగార్రాజులో నాగ్ సరసన ఆ హీరోయిన్ ?

That heroine acting with Nagarjun in Bangaraju movie

0
151

సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఇక నాగార్జున – కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఈ సినిమాకి ప్రశంసలు వచ్చాయి. ఇందులో బంగార్రాజుగా ఆయన నటన అద్భుతం అనే చెప్పాలి. అందుకే ఆ పాత్ర పేరునే టైటిల్ గా చేసుకుని, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే మరో సినిమా చేయనున్నట్టు నాగార్జున చెప్పారు.

కానీ ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. తాజాగా ఈ సినిమా ఆగస్ట్ నుంచి పట్టాలెక్కనుందట. ఈ సినిమాలో నాగచైతన్య జోడీగా కృతి శెట్టిని ఖాయం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక మరి నాగార్జున సరసన ఎవరు నటిస్తారు అనే టాక్ నడుస్తోంది. ఒక పేరు కూడా వినిపిస్తోంది.

నాగార్జున సరసన శ్రియను ఎంపిక చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది తెలుగు చిత్ర సీమలో. కొద్ది రోజులుగా నాగ్ పక్కన రమ్యకృష్ణ చేస్తారు అని వార్తలు వినిపించాయి, అయితే తాజాగా శ్రియ పేరును పరిశీలిస్తున్నారట. చూడాలి మరి ఎవరిని ఫైనల్ చేస్తారో. చిత్ర యూనిట్ నుంచి ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.