షారుక్​ సినిమా నుంచి తప్పుకున్న ఆ హీరోయిన్!

That heroine who dropped out of the Shah Rukh movie!

0
90

హీరోయిన్​ నయనతార బాలీవుడ్​ స్టార్​ షారుక్​ ఖాన్​-అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడా చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

అట్లీ దర్శకత్వంలో షారుక్​ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే కొద్ది రోజుల క్రితం బాద్​షా తనయుడు ఆర్యన్​ ఖాన్​ డ్రగ్స్​ కేసులో జైలుకెళ్లారు. దీంతో షారుక్​ తన షూటింగ్స్​కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అట్లీ రూపొందిస్తున్న సినిమా చిత్రీకరణ నిలిచిపోయినట్లు తెలిసింది. ఈ మూవీ మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో స్పష్టత లేదు.

మరోవైపు నయన్​ తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్​తో పెళ్లి పనుల్లో బిజీగా ఉందట. ఈ కారణాలతో తన డేట్స్​ సర్దుబాటు కాక ఆమె షారుక్​ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.