నయనతారకు ఆ దోషం..ప్రియుడితో పెళ్లికి ముందు మరో పెళ్లి?

That mistake for Nayantara..another marriage before marriage with Priyudi?

0
92

సినిమాల్లో టాప్ హీరోయిన్ కానీ ప్రేమ, పెళ్లి విషయంలో మాత్రం నయనతారకు పరిస్థితులు అంతగా కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. లవ్ ఎఫైర్స్ విషయమై ఎంతో సీనియారిటీ ఉన్న నయన్ ప్రేమ సంగతులు, పెళ్లి ముచ్చట్లకు నిత్యం వార్తల్లో ఎంతో కొంత స్పేస్ ఉంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నయనతార గురించిన ఓ వ్యక్తిగత విషయమై సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

ప్రేమ పక్షులుగా నయనతార- విగ్నేష్ శివన్ గత కొంతకాలంగా స్వేచ్ఛగా విహరిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ లవ్ ఎఫైర్ మొదట సీక్రెట్‌గా నడిచినా ఆ తర్వాత ఓపెన్ అయింది. దీంతో నయనతార- విగ్నేష్ జోడీ ఎక్కడికి వెళ్లినా అది హాట్ టాపిక్ అవుతోంది. ఈ పరిస్థితుల నడుమ తామిద్దరం త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నాం అని ప్రకటించారు కూడా. అయినప్పటికీ ఆ ముహూర్తం మాత్రం కుదరడం లేదు.

అయితే తాజాగా బయటకొచ్చిన మ్యాటర్ చూస్తే..నయనతారకి కుజ దోషం ఉందని తెలుస్తోంది. కుజ దోషం ఉన్న అమ్మాయికి, కుజదోషం ఉన్న అబ్బాయితోనే పెళ్లి చేయాలని శాస్త్రం చెబుతోందట. అయితే విగ్నేష్‌కి కుజదోషం లేదట. దీంతో ఇరు కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చారట. అందుకే నయన్ పెళ్లి ఆలస్యం అవుతోందనేది ఇండస్ట్రీలో టాక్.

నయన్‌కి ఉన్న ఈ దోషాన్ని నివారించడానికి విగ్నేష్ శివన్‌తో పెళ్లికంటే ముందు ఒక చెట్టు చేత తాళి కట్టించి ఆ తర్వాత ఇద్దరినీ ఒక్కటి చేయాలని భావిస్తున్నారట కుటుంబ సభ్యులు. త్వరలోనే ఈ తంతు ఫినిష్ చేసి ఆ వెంటనే ఘనంగా నయనతార- విగ్నేష్ పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే ప్రస్తుతం నయన్- విగ్నేష్ కలిసి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని అంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటివి కూడా నమ్ముతారా? అనే డౌట్ ఉంది కానీ సినీ ఇండస్ట్రీలోని వ్యక్తుల్లో సెటిమెంట్స్ ఎక్కువ కాబట్టి అదే నిజమని నమ్ముతున్నారు జనం.