రామ్ తో నాకు పరిచయం అలా ఏర్పడింది – సింగర్ సునీత

-

వ్యాపారవేత్త రామ్ వీరపనేని టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇటీవల వివాహం చేసుకున్నారు..శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం లో ఈనెల 9న వీరి వివాహం జరిగింది. చిత్ర సీమకు చెందిన వారు కుటుంబ సభ్యులు కొంత మంది మాత్రమే ఈ వివాహానికి హాజరు అయ్యారు. రామ్తో తన పరిచయం పెళ్లి గురించి చెప్పినప్పుడు పిల్లల స్పందన ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలను వెల్లడించారు సునీత.

- Advertisement -

నాకు ఆయన చాలా కాలంగా తెలుసు… నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకునేవారు, అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఇలా మా బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అని అనుకున్నాం.. ఇక నా పేరెంట్స్ ఎన్నో సంవత్సరాలుగా నన్ను వివాహం చేసుకో అని కోరుతున్నారు..

మన కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి భాగస్వామిగా దొరకడం ఎంతో అదృష్టం. రామ్ రూపంలో నాకు ఆ అదృష్టం లభించింది.
రామ్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని పిల్లలతో చెప్పినప్పుడు.. వారు నన్ను కౌగిలించుకుని.. ఈ నిర్ణయం తమకు ఎంతో సంతోషాన్నిస్తుంది అని చెప్పారు. నా పిల్లలు నన్ను బాగా అర్దం చేసుకున్నారు వారు నాకు దొరకడం ఎంతో అదృష్టం. ఈ జంటకు చిత్ర సీమ నుంచి పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...