గతంలో టాప్ హీరోలుగా చేసిన చాలా మంది విలన్ క్యారెక్టర్లు చేయడం కూడా చూశాం.. వీరికి ఈ పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి, ఇప్పటికి ఇలా కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు.. నిజంగా ఇలాంటి విలన్ పాత్రలు వస్తే చేయడానికి సిద్దం అని చెప్పే వారు కొందరు ఉన్నారు, మంచి నటన ఈ పాత్రలతో బయటపడుతుంది అంటారు నటులు.
హీరో పాత్ర తప్పించి ఒక్క నెగిటీవ్ పాత్ర కూడా చేయని నటుడు అంటే లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్రరరావు గారే. ఏఎన్ఆర్ తన నటనా జీవితంలో ఒక్కసారిగా విలన్ పాత్ర చేయలేదు. అయితే దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయనని ప్రశ్నిస్తే సమాధానం ఏమన్నారంటే.
నా బాడీకి నేను విలన్ అంటే ఏమైనా అర్థం ఉందా. నేను విలన్ గా సూట్ కానని నాకు తెలుసు, అయితే పాత్రలు క్యారెక్టర్లు వచ్చాయి ..కాని నేను ఈ పాత్ర చేయను నేను సూట్ అవ్వను అని చెప్పేవాడిని అని తెలిపారు ఆయన.. విలన్ పాత్ర అంటే భారీ పర్సనాలిటీ, కండలు తిరిగిన శరీరం ఉండాలి. సో ఇలాంటివి లేనప్పుడు ఆ పాత్ర నేను చేస్తే న్యాయం చేసినట్లు ఉండదు అని తెలిపారు ఎఎన్నార్.