సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు అలా కామెంట్ చేశారు – హిమజ

-

సినిమా పరిశ్రమలో అవకాశాలు అంత సులువుగా రావు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా పరిశ్రమలో ఓస్ధాయికి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు, అందుకే వారి కష్టాలు ఏ రోజు మర్చిపోరు, అయితే హీరోలు అవ్వాలి అని హీరోయిన్లు అవ్వాలి అని చాలా మంది వస్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీకి.. ఒక్క అవకాశం ప్లీస్ అని అడుగుతూ ఉంటారు కొందరు.. వెండితెరలో రావాలి అని ప్రయత్నిస్తారు.. అవకాశాలు రాక బుల్లితెరకు పరిమితం అయిన వారు ఉన్నారు.

- Advertisement -

అయితే ఇప్పుడు సీరియల్ వల్ల కూడా చాలా మంది మంచి ఫేమ్ పొందుతున్నారు, తాజాగా సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ హిమజ లైఫ్లో కొన్ని విషయాలు తెలిపింది, సినిమా పరిశ్రమలోకి వచ్చిన సమయంలో తనకు ఎదురు అయిన ఇబ్బందులు సవాళ్లు చెప్పింది ఆమె.

తెనాలి సమీపంలోని వీర్లపాలెంలో జన్మించిన హిమజ.. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి కొన్ని రోజులపాటు ప్రైవేట్ టీచర్గా పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్పై ఉన్న మక్కువతో ఆ దిశగా ముందు సాగింది, ఇక సీరియల్లు చేసింది, రియాల్టీ షోలు చేసింది, ఇలా మంచి పేరు సంపాదించుకుంది శతమానం భవతి, చిత్రలహరి, వినయ విధేయ రామ, జంబలకిడి పంబ, ఉన్నది ఒకటే జిందగీ, స్పైడర్ ఇలా వరుస సినిమాల్లో నటించింది.

ఇప్పుడు హిమజ జ అనే సినిమా చేస్తోంది. నీది మేకప్ వేసే ముఖం కాదు అని అన్నారట చిత్ర సీమలో అడుగు పెట్టిన సమయంలో.. కాని వారే ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా బాగా చేస్తున్నావు అంటున్నారట, ఈ మాట చెప్పి ఆమె ఎంతో సంతోషించింది, ఆనాడు అలా అన్నవారు నేడు ఇలా అంటున్నారు అని తెలియచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...