‘లైగర్’ అందుకే అనుకున్నంత ఆడలేదు?: ప్రముఖ ఫిల్మ్​ట్రేడ్​ అనలిస్ట్​ ​తౌరాని

0
101

టాలీవుడ్ రౌడీ హీరో, అర్జున్ రెడ్డితో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు విజయ్ దేవరకొండ. మరోవైపు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ హ్యాష్ టాగ్. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో నిన్న రిలీజ్ అయింది.

ఈ చిత్రంపై విజయ్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఇండియా షేక్ అయితది. 1000 కోట్లు కలెక్షన్స్ పక్కా అని బహిరంగంగానే చెప్పారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. కలెక్షన్స్​ పరంగా బాగా నిరాశపరిచింది. లైగర్​ సినిమా ఎందుకు అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయిందో ప్రముఖ ఫిల్మ్​ట్రేడ్​ అనలిస్ట్​ కరన్​ తౌరాని చెప్పుకొచ్చారు. ఈ సినిమా లైఫ్​టైమ్​ కలెక్షన్స్ ఎంత వస్తాయో కూడా అంచనా వేశారు.

“సినిమా రిలీజ్​ కాకముందు ఈ చిత్రం లైఫ్​టైమ్​ కలెక్షన్స్​ రూ.170-180 కోట్లు సాధిస్తుందని, అందులో 25 శాతం బాలీవుడ్ బాక్సాఫీస్​ నుంచి వస్తుందని అంచనా వేశాం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ లైఫ్​టైమ్​ ఫిగర్​ రూ.55-60కోట్లు మాత్రమే వసూళ్లను అందుకుంటుందని తెలుస్తోంది. మంచి కంటెంట్​, రియలిస్టిక్​ వీఎప్​ఎక్స్​ ఉంటేనే సినిమాలు బాక్సాఫీస్​ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంటాయి. ఇండస్ట్రీ కంటెంట్ విషయంలో మార్పులు చేసుకుంటేనే కష్టాల్లో నుంచి బయటపడుతుందని ఆయన అన్నారు.”