ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ..కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈనెల 24న సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం అనంతరం కిమ్స్ ఆస్పత్రి ఎండి భాస్కరరావు మీడియాతో మాట్లాడారు.
సిరివెన్నెలకు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ చికిత్స జరిగింది. ఒక ఊపిరితిత్తులో సగభాగం తీయాల్సి వచ్చింది. వారం క్రితం మరో ఊపిరితిత్తికి క్యాన్సర్ వచ్చింది. సిరివెన్నెల గత ఐదు రోజులుగా ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. కిడ్నీ దెబ్బతినడంతో శరీరం అంతా ఇన్ఫెక్షన్ వ్యాపించింది. సాయంత్రం 4.07ని.లకు సిరివెన్నెల చనిపోయారని డాక్టర్ చెప్పారు.