జబర్ధస్త్ షో ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే, అయితే అక్కడ జడ్జిగా ఉన్న నాగబాబు తర్వాత
అదిరింది అనే షోలో పాల్గొన్నారు. ఇది కూడా ప్రేక్షకులకి బాగా నచ్చింది, ఇక ఇందులో
చమ్మక్ చంద్ర, వేణు, ధన్ రాజ్‌తో పాటు సద్దాం వంటి వాళ్లు కామెడీతో అలరించారు, అయితే ఈ షో ఉన్నట్లు ఉండి ఆగిపోయింది, దీంతో ఇది మళ్లీ వస్తుందా రాదా అనే అనుమానం చాలా మందిలో కనిపిస్తోంది.
ఈ అదిరింది షో ఎందుకు ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది అనే అంశంపై కమెడియన్ వేణు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు, ఈ షో అందరూ అనుకున్నట్లు ఆగిపోలేదు అని తెలిపారు,
ఇది టెలికాస్ట్ అయ్యే ఛానల్ జాతీయ ఛానల్ సో ఇది సీజన్ల వారీగా వస్తుంది, అందుకే మొదటి సీజన్ పూర్తి అయింది అందుకే ఆగింది.
మరోసీజన్ స్టార్ట్ అవ్వగానే ఇది వస్తుంది అని తెలిపాడు, దీంతో అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు, త్వరగా ఈ సీజన్ స్టార్ట్ చేయాలి అని కామెంట్లు చేస్తున్నారు.