హార్ర‌ర్ మూవీలు చూసేవారికి బంప‌రాఫ‌ర్ ఇచ్చిన అమెరికా కంపెనీ

The American company that gave bumper to those who watch horror movies

0
86

హార్ర‌ర్ మూవీలు చూడాల‌ని చాలా మందికి కోరిక ఉంటుంది. అంతేకాదు పక్క‌వారు భ‌య‌ప‌డుతున్నా వీరు మాత్రం ఆ మూవీలో లీనం అవుతూ ఉంటారు. కొంద‌రు అస‌లు ఆ ట్రైల‌ర్ లాంటివి కూడా చూడ‌టానికి భ‌య‌ప‌డుతూ ఉంటారు. అయితే తాజాగా ఇలా హ‌ర్ర‌ర్ మూవీస్ ఇష్ట‌ప‌డే వారికి
అమెరికాకు చెందిన ఒక కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది.

ఆ కంపెనీ చెప్పిన‌ 13 సినిమాలను 9 రోజుల వ్యవధిలో చూస్తే 1300 డాలర్లు బ‌హుమ‌తి ఇస్తాము అని తెలిపింది.హారర్ మూవీ హార్ట్ రేట్ అనలిస్ట్ అంటూ పేరు పెట్టింది ఫైనాన్స్‌బజ్ అనే అమెరికా సంస్థ.
హారర్ చిత్రాల్లో నాణ్యతపై సినిమా బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని అంచనా వేయడానికే ఈ అధ్యయనం చేస్తున్నారట.

క‌చ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి అమెరికాకి చెందిన వారు అయి ఉండాలి. మూవీ చూసి ఈ సినిమాలకు ర్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాలు చూసేవారు ఫిట్‌బిట్ వాచ్ ధరించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

మూవీలు చూద్దాం

SAW
అమిటీవిల్లె హారర్
ఎ క్వయిట్ ప్లేస్
ఎ క్వయిట్ ప్లేస్ పార్ట్ 2
క్యాండీమ్యాన్
ఇన్‌సైడియస్
ది బ్లైర్ విచ్ ప్రాజెక్ట్
సినిస్టర్
గెట్ అవుట్
ది పర్జ్
హాలోవీన్
పారానార్మల్ యాక్టివిటీ
అన్నబెల్లె