బిగ్ బాస్ రియాల్టీ షో మన దేశంలో బాగా సక్సెస్ అయింది అంటే బాలీవుడ్ లో అనే చెప్పాలి, హిందీ బిగ్ బాస్ షోకు చాలా మార్కెట్ ఉంది, ఇక సల్మాన్ హోస్ట్ గా కలర్స్ టీవీలో టీఆర్పీలతో దేశంలో ముందు ఉంది ఈ రియాల్టీషో.
కలర్స్ టీవీలో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్బాస్ సీజన్ 14 మొదలైంది. ఇక రెండు రోజుల క్రితం అట్టహాసంగా దీనిని స్టార్ట్ చేశారు, సీజన్ 14 లో 11 మంది మాత్రమే కంటెస్టెంట్లు ఉన్నారు. ఈసారి హౌస్ లో ఉన్న వారు అభినవ్, ఇజాజ్, జాన్, జాస్మిన్, నిక్కి, నిశాంత్, పవిత్ర, రాహుల్ రుబియా, సారా , షెహజాద్ లు హౌస్ లో ఎంటర్ అయ్యారు.
ఇక తొలి రోజు సల్మాన్ కంటెస్టెంట్ల జాతకాల్ని చెప్పించడానికి ఓ ఆస్ట్రాలజర్ని తీసుకొచ్చి బిగ్బాస్ స్టేజ్పై ఒక్కో కంటెస్టెంట్ జాతకాన్ని చెప్పించాడు. మరి సరదా కోసం తన జాతకం కూడా చూడమని చెప్పాడు, అయితే అందరూ సరదాగా మాట్లాడుకునే తన పెళ్లి గురించి కూడా అడిగాడు, వెంటనే ఆ జోతిష్యుడు జాతక రిత్యా గ్రహాలు బాగా లేవని, ఈ జీవితంలోపెళ్లి యోగం లేదని కుండబద్దలు కొట్టాడట. పెద్ద గండం నుంచి తప్పించుకున్నా అని సరదాగా నవ్వులునవ్వాడు సల్మాన్.